HomeMovie News'కుబేర' మూవీ నాదే : కింగ్ అక్కినేని నాగార్జున

‘కుబేర’ మూవీ నాదే : కింగ్ అక్కినేని నాగార్జున

- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా కుబేర. ఈ మూవీలో రష్మిక మందన్న కూడా ఒక కీలకపాత్ర చేసిన విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవిశప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి సంస్థతో కలిసి అమీగోస్ క్రియేషన్స్ సంస్థ పై శేఖర్ కమ్ముల నిర్మించారు.

నిన్న మంచి అంచనాలతో రిలీజ్ అయిన కుబేర బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ తో ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర పట్ల ప్రేక్షకులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తుండగా పలువురు ఆయన అభిమానులు మాత్రం నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన కుబేర సక్సెస్ మెయిట్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ వాస్తవానికి తొలిసారిగా తనకి కుబేర కథని శేఖర్ కమ్ముల వినిపించినప్పుడు ఇది తన సినిమానే అనిపించిందన్నారు. కథలో తన పాత్రనే ప్రధానంగా సాగిన విధానం ప్రకారం ఈ సినిమాలో తానే హీరో అని అలానే ధనుష్ పాత్ర కూడా చాలావరకు తనకు సమానంగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

రష్మిక తో పాటు ధనుష్ వంటి నటులతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఓవరాల్ గా కుబేర కి ఎంతో పెద్ద విజయం అందించిన ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున.

See also  షాకింగ్ గా 'కుబేర' మూవీ రన్ టైం

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories